సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:21 IST)

రాయలసీమ జిల్లాల్లో వర్షాలు

రాయలసీమ జిల్లాల్లో ఈరోజు  ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. 21 నుండి 23వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలు కడప  చిత్తూరు, అనంతపురం,  కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి  భారీ వర్షాలు కురుస్తాయి.

నెల్లూరు,  ప్రకాశం,  గుంటూరు,  కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, 
పశ్చిమ,  తూర్పు గోదావరి,  విశాఖపట్నం,  విజయనగరం,  శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసె సూచనలు ఉన్నాయి.

వర్షాల వల్ల రాయలసీమలో వాగులు,  వంకలు పొంగి పొర్లే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు వాగులను దాటే సాహసం చేయరాదు. వర్షాల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు  పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణుల సూచన.