శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (15:12 IST)

ఎస్బీఐ గుడ్ న్యూస్: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత చౌక

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్, వెహికిల్ లోన్ తదితర రుణాలను తీసుకునే వారి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల కాల పరిమితులపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్స్ తగ్గించామనీ, తగ్గించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి వస్తాయని తెలియజేసింది. ఎస్బీఐ నిర్ణయంతో గృహ, ఆటో తదితర రుణాలు మరింత చౌక అవుతాయి.
 
కాగా ఎస్బీఐ MCLR రేటును తగ్గించడం ఈ ఏడాదిలో ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. ఆర్బీఐ రెపో రేటు ప్రయోజనాలను ఎస్బీఐ సాధ్యమైనంతగా కస్టమర్లకు అందించాలని ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద ఎస్బీఐ నిర్ణయంతో కస్టమర్లు ఖుషీఖుషీ అవుతున్నారు.