హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ క్యాప్ ఫండ్
భారతదేశంలో సుప్రసిద్ధ మ్యూచువల్‌ఫండ్ హౌస్‌లలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ ఎస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నూతన ఫండ్ ఆఫర్ హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ క్యాప్ ఫండ్‌ను లార్జ్‌క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ విభాగాల వ్యాప్తంగా తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవాలని చూసే మదుపరుల కోసం విడుదల చేసింది.
ఈ స్కీమ్‌లో భాగంగా తమ మొత్తం ఆస్తులలో 25%ను భారీ, మధ్య , చిన్నతరహా కంపెనీలలో పెట్టుబడులు పెడితే, 25%ను ఫండ్ మేనేజర్ల మార్కెట్ అంచనాలకనుగుణంగా పెట్టుబడులు పెడుతుంది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ నవంబర్ 23, 2021న తెరుచుకుంటుంది. డిసెంబర్ 07, 2021న దీనిని మూసివేస్తారు.
ఈ స్కీమ్‌ను గోపాల్ అగర్వాల్ నిర్వహిస్తారు, ఫండ్ మేనేజ్‌మెంట్, ఈక్విటీ రీసెర్చ్‌లో 19 సంవత్సరాల అనుభవం ఆయనకు ఉంది. ఈ మల్టీక్యాప్ ఫండ్ గురించి గోపాల్ అగర్వాల్ మాట్లాడుతూ, విభిన్నమైన మార్కెట్ క్యాప్ విభాగాలు, విభిన్న సమయాలలో విభిన్నంగా పనితీరు కనబరుస్తుంటాయి. విభిన్నమైన మార్కెట్ క్యాప్స్ వ్యాప్తంగా పెట్టుబడులను అన్వేషించే మదుపరులకు ఏకీకృత పరిష్కారం హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ క్యాప్ ఫండ్ అని అన్నారు.