సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (13:22 IST)

పసిడి ప్రియులకు శుభవార్త: స్వల్పంగా తగ్గిన ధరలు

నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. నేడు ఎం‌సి‌ఎక్స్‌లో బంగారం ధర 0.20 శాతం దిగొచ్చింది. ఈ పతనం తర్వాత 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.49,195గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా నేడు కాస్త తగ్గింది. కిలో వెండి ధర 0.43 శాతం తగ్గి రూ.66,340కి చేరుకుంది.
 
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,420 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 కు చేరింది. 
 
ఆర్థిక రాజధాని ముంబై‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,470 కు చేరింది.
 
బెంగళూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,070 ఉండగా,  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 కు చేరింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 కు చేరింది. ఇక వెండి ధర మాత్రం రూ.400 తగ్గి ప్రస్తుతం కేజీ వెండి ధర 66,400కు చేరింది.