గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (22:05 IST)

రూ. 600 కోట్ల‌తో విశాఖ‌లో మాల్ ఏర్పాటు.. 8వేల మందికి ఉపాధి అవకాశాలు

jagan
15 ఎక‌రాల స్థ‌లంలో రూ. 600 కోట్ల‌తో విశాఖ‌లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌గా రానున్న ఇన్ ఆర్బిట్ మాల్‌ ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇన్ ఆర్బిట్ మాల్ స్థాప‌న కార్య‌క్ర‌మానికి మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 
 
ఈ మాల్ పూర్త‌వుతే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 8వేల మందికి ఉపాధి కలుగుతుంద‌ని సీఎం జగన్ స్పష్టం చేశారు. తొలి విడతలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్త‌వుతుంద‌న్నారు. 
 
ఫేజ్-2లో దాదాపు 3,000 మంది ఉద్యోగుల‌కు స‌రి ప‌డేలా 2.5 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు ఆఫీస్ స్పేస్ 2027 నాటికి సిద్ద‌మ‌య్యేలా ప్ర‌ణాళిక త‌యారు చేశార‌ని తెలిపారు.