బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (11:48 IST)

ఎల్ఐసీ హెచ్చరిక.. మోసగాళ్ల నుంచి జాగ్రత్త..

LIC
ప్రముఖ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తుంది. ఇటీవల వినియోగదారులకు సోషల్ మీడియా ద్వారా ప్రతి చిన్న అప్ డేట్ అందిస్తున్న సంస్థ.. తాజాగా ప్రజలను హెచ్చరించింది. 
 
కంపెనీ లోగోను ఎవరు కూడా ఉపయోగించవద్దని సూచించింది. కంపెనీ అనుమతి లేకుండా.. లోగో ఉపయోగించడం శిక్షార్హమని తెలిపింది. ఇలా చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
 
ఏ వెబ్‌సైట్ కానీ లేదంటే ఇతరులు, వ్యాపారులు ఇలా ఎవ్వరూ కూడా కంపెనీ అనుమతి లేనిదే ఎల్‌ఐసీ లోగో ఉపయోగించకూడదని తెలిపింది. అలా చేసినవారికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా.. మరో విషయంపై కూడా కస్టమర్లను ఎల్ఐసీ అలర్ట్ చేసింది. 
 
మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలిని కోరింది. ఎల్ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు అడగరు అని స్పష్టం చేసింది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. 
 
ఏదైనా అనుమానిత కాల్స్ లేదా అనుమానాస్పద మెయిల్స్ వస్తే.. [email protected]కు తెలియజేయాలని తెలిపింది. కంపెనీ కాల్ సెంటర్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచింది. 022-6827 6827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. సందేహాలను పరిష్కరించుకోవచ్చు.