బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (12:33 IST)

లండన్ కోర్టులో విజయ్ మాల్యాకు ఊరట.. అప్పుల బాధ తీరేవరకు టైమ్ ఇవ్వండి

Vijay mallya
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టులో వేసిన కేసులు, కర్నాటక హైకోర్టులో అప్పుల పూర్తి సర్దుబాటుకు దాఖలు చేసిన పిటిషన్లు పరిష్కారమయ్యేంత వరకు మాల్యాకు సమయం ఇవ్వాలని లండన్‌లోని కంపెనీ, దివాళా వ్యవహారాల న్యాయస్థానం జడ్జి మైకేల్ బ్రిగ్స్ ఆదేశించారు. 
 
భారత్‌లో దాఖలు చేసిన కేసుల్లో విజయం మాల్యా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పలేమని, అయితే సాక్ష్యాలు మాత్రం గెలిచేందుకు తగిన అవకశాలు ఉన్నట్టు చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు. 114.5 కోట్ల పౌండ్ల బకాయీలు రాబట్టుకునేందుకు ఆయన దివాళా తీసినట్టు ప్రకటించాలని ఎస్బీఐ దాఖలు చేసిన కేసు విచారణ వాయిదాకు లండన్ కోర్టు అంగీకరించింది. 
 
ప్రస్తుత దశలో దివాళా నిర్ణయం కోసం పట్టుబట్టడం వల్ల బ్యాంకులకు ఎలాంటి మేలు జరగదని లండన్ కోర్టు పేర్కొంది. ఈ దివాళా పిటిషన్ అసాధారణమైందని, భారత్‌లో అనేక వ్యవహారాలు కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు ఇలా బ్యాంకులు దివాళాకు పట్టుబట్టడం ఏమిటని జడ్జి మైకేల్ బ్రిగ్స్ విస్మయం వ్యక్తంచేశారు. పూర్తి స్థాయి అప్పుల చెల్లింపు జరిగేంత వరకు ఈ కేసు విచారణ వాయిదా వేయాలని జడ్జి గ్రిబ్స్ స్పష్టం చేశారు.