Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ సిలిండర్‌ ధర : రూ.100 బాదుడు.. రూ.10 తగ్గింపు

Written By ఠాగూర్
Updated: గురువారం, 1 ఏప్రియల్ 2021 (07:58 IST)
వంట గ్యాస్ సిలిండర్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తగ్గించింది. గత రెండు మూడు నెలలుగా రూ.100 మేరకు వంట గ్యాస్ ధరను పెంచిన ఐఓసీ.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.10 తగ్గించింది. ఈ మేరకు ప్రకటన చేసింది.  ఫిబ్రవరిలో వరుసగా ధరల పెరుగుదల ప్రభావంతో ఉన్న గృహిణులకు ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 
 
నిజానికి గత మూడు నెలల్లోనే వంట గ్యాస్ ధర రూ.100 నుంచి రూ.120వరకు పెంచేశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ధరల పెంపు ఉంది. దీనిపై గగ్గోలు జనం గగ్గోలు పెట్టిన ధరలు తగ్గించలేదు. 
 
ఈ క్రంలో ఏప్రిల్‌ 1 నుంచి సిలిండర్‌పై రూ.10 తగ్గించింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బుధవారం సిలిండర్‌ ధరలో రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇప్పటికే వారంలో మూడుసార్లు తగ్గించినప్పటికీ, వంట గ్యాస్‌ ధర కూడా సమీప భవిష్యత్తులో తగ్గుతాయని చమురు అధికారులు పేర్కొంటున్నారు. 
 
కాగా.. తాజా తగ్గింపుతో ఢిల్లీలో రూ.819 ఉన్న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.809 కి చేరుతుంది. ఇతర మార్కెట్లలోనూ తగ్గించిన ధర అమల్లో ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. వాణిజ్య సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments