మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (12:42 IST)

డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త...ఎండీఆర్ చార్జీలు తగ్గించిన ఆర్బీఐ

దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు.. భారత రిజర్వు బ్యాంకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే పేద, మధ్యతరగతి, చిన్న వ్యాపారులకు స్పెషల్‌గా

దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు.. భారత రిజర్వు బ్యాంకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే పేద, మధ్యతరగతి, చిన్న వ్యాపారులకు స్పెషల్‌గా 100 రోజుల వరకు ఓ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇపుడు డెబిట్ కార్డు కస్టమర్లను ఆకర్షించేందుకు దృష్టిపెట్టింది. 
 
ఇందుకోసం డెబిట్ కార్డు సేవలు అందించినందుకు వసూలు చేసే ఎండీఆర్‌ (మర్చంట్ డిస్కంట్ రేట్స్) చార్జీలను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఓ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కొనసాగుతాయని వివరించింది. ఈ తగ్గింపు రెండువేల లోపు చెల్లింపులకే వర్తిస్తుందని, అది కూడా డెబిట్‌ కార్డులకు మాత్రమేనని స్పష్టం చేసింది. 
 
ఇంకోవైపు... ఇటు మొబైల్‌, ఇంటర్నెట్‌ ద్వారా చేసే చిన్నపాటి చెల్లింపులపై అన్ని రుసుములను రద్దు చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటివరకు రూ.2 వేల వరకు లావాదేవీలపై 0.75శాతం, ఆపై ఒక శాతం ఎండీఆర్‌ చార్జీలుగా బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇకపై రూ.వెయ్యి వరకు 0.25 శాతం, రూ.1,001 నుంచి రూ.2 వేల లావాదేవీలకు 0.5 శాతం మాత్రమే వసూలు చేయనున్నాయి.