యూపీఐ యూజర్లకు ఇక షాక్ తప్పదు.. ఏప్రిల్ 1 నుంచి ఫీజు ఖాయం
యూపీఐ యూజర్లు ఇకపై జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది. ఏప్రిల్ 1 నుంచి మొబైల్ పేమెంట్ యాప్ కస్టమర్ల ఆర్థిక లావాదేవీలపై ఫీజు వసూలు చేస్తారు. ఇందులో భాగంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుంచి కొన్ని రకాల చెల్లింపులపై యూపీఐ ద్వారా ఇంటర్‌ఛేంజ్ వసూలు చేయాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది.
ప్రీపెయిడ్ సాధనాలైన వ్యాలెట్లు, కార్డుల ద్వారా యూపీఐ విధానంలో చేపట్టే మర్చంట్ లావాదేవీలకు 1.1 శాతం రుసుము చెల్లించాల్సి వుంటుంది. ఆన్‌లైన్ మర్చంట్స్, పెద్ద మర్చంట్స్, చిన్నపాటి ఆఫ్‌లైన్ మర్చంట్లకు చేసే…రూ.2000కు పైగా విలువైన లావాదేవీలకు ఈ 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది.
అయితే బ్యాంకు, ప్రీపెయిడ్ వ్యాలెట్ మధ్య పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై ఈ రుసుములు వర్తించవు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి వేరే మర్చంట్‌తో చేసే లావాదేవీలపై ఫీజు ఉండదు.
అంతేగాకుండా ప్రీపెయిడ్ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000లకు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. అయితే గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేస్తారని తెలుస్తోంది.