శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (10:53 IST)

భర్త దుబాయ్‌లో వున్నాడని చెప్పింది.. అలా లొంగదీసుకుని..

honey trap
హనీట్రాప్‌లో పడిన ఓ యువ పారిశ్రామిక వేత్త ఎట్టకేలకు బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పుట్టేనహళ్లి రాణా పోలీసులు మెహర్ అనే యువతితో కలిపి నలుగురిపై కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తన భర్త దుబాయ్‌లో వున్నారని.. తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని తెలిపింది. దీన్ని నమ్మిన ఆ యువకుడిని ఆ మహిళ లొంగదీసుకుంది. 
 
ఈ క్రమంలో ఆమెను కలిశాడు. అయితే ఇద్దరూ ఒంటరిగా వున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిని బెదిరించారు. ఆమెను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశారు. వారి బెదిరింపులకు బిత్తరపోయిన ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.