సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:11 IST)

గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఎంపిఓసి యూత్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ వంటల ప్రతిభ

image
మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్ (MPOC) విజయవంతంగా తమ యూత్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్  ముగింపు వేడుకను గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పామాయిల్ యొక్క అసాధారణమైన వైవిధ్యత, ఆరోగ్య ప్రయోజనాలను తెలపటంతో పాటుగా వంటల సృష్టిలో అతి ముఖ్యమైన పదార్ధంగా దీని ప్రాముఖ్యతను ప్రధానంగా వెల్లడించింది. అనుభవజ్ఞులైన నిపుణులతో వర్ధమాన పాకశాస్త్ర ప్రతిభను ఏకం చేయడం ద్వారా, ఈ కార్యక్రమం అశేషమైన ప్రశంసలను పొందింది.
 
"అమెచ్యూర్", "ఎక్సపర్ట్స్" విభాగాలుగా విభజించబడిన ఈ పోటీలో ప్రతి గ్రూప్‌లో 40 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. "అమెచ్యూర్" వర్గంను మొదటి- ద్వితీయ సంవత్సర విద్యార్థుల కోసం రూపొందించబడింది, పాల్గొనేవారికి ఒకే స్టార్టర్‌ను రూపొందించడం ద్వారా తమ పాక శాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించడానికి తగిన అవకాశం కల్పిస్తూ 1 గంట, 30 నిమిషాల సమయం అందించబడింది. ఈ విభాగం యువ ప్రతిభావంతులకు వారి సృజనాత్మకత, వంట పట్ల అభిరుచిని వ్యక్తీకరించడానికి తగిన వేదికను అందించింది, తమ పాక శాస్త్ర ప్రయాణానికి వేదికగానూ నిలిచింది.
 
"ఎక్సపర్ట్స్" విభాగంలో, 3వ మరియు 4వ సంవత్సరాల విద్యార్థులు వున్నారు. ప్రత్యేకంగా వీరి కోసమే ఈ విభాగం రూపొందించబడినది. ఈ విభాగానికి 2 గంటల 30 నిమిషాల పాటు సమయం అందించి తమ పాక శాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం అందించారు. ఈ డిమాండ్ ఉన్న వర్గం విద్యార్థులకు శాఖాహారపు స్టార్టర్, మాంసాహార ప్రధాన వంటకం, అనుబంధాన్ని సృష్టించే బాధ్యతను అప్పగించింది. తమ పాక శాస్త్రానికి కళాత్మకతను జోడిస్తూ పామాయిల్‌తో సామరస్యపూర్వకమైన, సమతుల్యమైన భోజనాన్ని క్యూరేట్ చేయగల వారి సామర్థ్యాన్ని ఈ సవాలు హైలైట్ చేసింది.
 
ఈ పోటీ అంతటా, పామాయిల్, దాని విలక్షణమైన రుచి, పోషక ప్రయోజనాల పరంగా ప్రత్యేకంగా నిలిచింది. తయారుచేయబడిన అన్ని వంటలలో స్టార్ ఇంగ్రిడియెంట్‌గా ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. ప్రదర్శించబడిన పాక శాస్త్ర నైపుణ్యానికి మించి, పామాయిల్ యొక్క స్థిరమైన ఉత్పత్తి మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి పాల్గొనేవారికి, హాజరైన వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
 
ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల తమ ఆనందం వ్యక్తం చేసిన గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ, "ఈ ఎడ్యుకేషనల్ మాడ్యూల్ ఖచ్చితంగా మలేషియా పామ్ ఆయిల్, దాని ప్రయోజనాలను బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడింది. పామ్ఆయిల్‌లో ఆహారాన్ని ఎంత బాగా వండవచ్చు అనేది తెలిసింది. ఈ మాస్టర్ చెఫ్ పోటీ మొదటిసారిగా పామాయిల్‌ను ఉపయోగిస్తున్న విద్యార్థుల విజ్ఞానం మరియు నైపుణ్యాలను ప్రదర్శించింది. మా విద్యార్థులకు ఇది గొప్ప అభ్యాస అనుభవం. మరోసారి భావన జీ మరియు మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు" అని అన్నారు.