గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (16:40 IST)

నవంబరు నెలలో బ్యాంకులకు 10 రోజుల సెలవు

banks
ఈ యేడాదిలో మరో రెండు నెలలు మాత్రమే మిగిలివున్నాయి. అయితే, నవంబరు నెలలో బ్యాంకులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు రానున్నాయి. వీటిలో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాల మేరకు మేరకు నవంబరు నెలల 12 రోజుల పాటు సెలవులు వస్తాయని పేర్కొంది.
 
నవంబరు 1, 5, 10, 11, 13, 15, 19, 24, 25, 27 తేదీల్లో సెలవులు వస్తున్నందున ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ పేర్కొంది. అయితే, వీటిలో వారాంతపు సెలవులు, దీపావళి పండుగ సెలవులు కూడా ఉన్నాయని పేర్కొంది. 
 
కాగా, ప్రస్తుతం నెలలో ఆరు రోజుల పాటు బ్యాంకులు సెలవులు వస్తున్నాయి. ప్రతి నెల రెండు, నాలుగు శనివారాలతో పాటు ఆదివారాల్లో సెలువులు వస్తున్నాయి. కానీ, నవంబరు నెలలో వివిధ రకాలైన పండుగల కారణంగా ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.