ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (17:15 IST)

ప్రధాని మోడీ పాలనలో పెరుగుదల : బిఫోర్ మోడీ.. ఆఫ్టర్ మోడీ

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలిలో పాలన చేస్తూ దూసుకెళుతున్నారు. ముఖ్యంగా అనేక కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ కఠిన నిర్ణయాల వల్ల సాధారణ ప్రజ

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలిలో పాలన చేస్తూ దూసుకెళుతున్నారు. ముఖ్యంగా అనేక కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ కఠిన నిర్ణయాల వల్ల సాధారణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ఆయన ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పాలనకు ముందు.. మోడీ పాలన తర్వాత కొన్ని రంగాల్లో ధరల పెరుగుదలను పరిశీలిస్తే... 
 
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు రైల్వే ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ.3గా ఉంటే ఇపుడది రూ.10కి చేరుకుంది. మొబైల్ నెట్ ప్యాక్ రూ.98గా ఉంటే ఇపుడు కనీస ధర రూ.246గా అయింది. కేజీ పప్పు దినుసుల ధర రూ.70గా ఉంటే మోడీ పాలనలో రూ.150కు చేరుకుంది. సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) 12.36 శాతంగా ఉంటే ఇపుడది 14.5 శాతానికి పెంచారు. 
 
ఎక్సైజ్ డ్యూటీని 10 శాతంగా ఉంటే మోడీ ప్రభుత్వం 12.36 శాతానికి పెంచింది. ముఖ్యంగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగింది. అంటే రూపాయి విలుప భారీగా పతనమైంది. మోడీ పాలనకు ముందు ఒక డాలరుతో రూపాయి మారకం విలువ రూ.58.50గా ఉంటే.. ప్రస్తుతం రూ.68.50గా ఉంది.