శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 20 మార్చి 2023 (21:05 IST)

హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో

image
అంతర్జాతీయ ఆతిథ్య సాంకేతిక వేదిక ఓయో, 2023 సంవత్సరానికిగానూ 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను హైదరాబాద్‌లో తమ పోర్ట్‌ఫోలియోకు జోడించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా పెరుగుతున్న వ్యాపార యాత్రికులకు తగిన మద్దతు అందించడానికి ఓయో రూమ్స్‌ ప్రణాళిక చేసింది.  ఓయో రూమ్‌ యొక్క విస్తరణ ప్రధానంగా అత్యంత కీలకమైన వ్యాపార కేంద్రాలైనటువంటి గచ్చిబౌలి, హై–టెక్‌ సిటీ, లకడీ కా  పూల్‌ మరియు ఎయిర్‌ పోర్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండనున్నాయి.
 
ఓయో యొక్క ప్రీమియం హోటల్‌ బ్రాండ్‌లలో టౌన్‌హౌస్‌ ఓక్‌, టౌన్‌హౌస్‌, కలెక్షన్‌ ఓ మరియు క్యాపిటల్‌ ఓ ఉన్నాయి. ఓయో ఇప్పుడు తమ తొలి దశ విస్తరణలో ప్రధానంగా టౌన్‌హౌస్‌ ఓక్‌, టౌన్‌హౌస్‌ పై దృష్టి సారించనుంది. హోటల్‌ యజమానులు, విస్తృత శ్రేణి, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సేవలతో ప్రయోజనం పొందగలరు.  వీటిలో సంభావ్య అతిథులకు ఓయో రూమ్స్‌ నెట్‌వర్క్‌లో ఉన్న 15వేలకు పైగా కార్పోకేట్‌ ఖాతాలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న 10వేలకు పైగా ట్రావెల్‌ ఏజెంట్లతో కూడిన నెట్‌వర్క్‌ సహాయంతో చేరుకునే అవకాశం, చెల్లింపుల సౌకర్యమూ అందిస్తుంది. ఓయో యాప్‌, వెబ్‌సైట్‌ మరియు ఇతర కీలక ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు (ఓటీఏలు) ద్వారా లభించే దానికి అదనంగా ఇది లభిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేస్తున్న మూడవ ట్రావెల్‌ యాప్‌గా ఓయో నిలిచింది.
 
ఈ విస్తరణ ప్రణాళికలను గురించి ఓయో చీఫ్‌ మర్చంట్‌ ఆఫీసర్‌ అనూజ్‌ తేజ్‌పాల్‌ మాట్లాడుతూ, ‘‘ఇటీవలి కాలంలో ప్రజలు అనుభవాలపై అధికంగా వెచ్చించడానికి ఆసక్తి చూపుతుండటం కనిపిస్తుంది. అందువల్ల, హోటల్స్‌ ఇప్పుడు అదనపు సేవలు మరియు సౌకర్యాలను వారి ప్రయాణ అనుభూతులను వృద్ధి చేసేందుకు వీలుగా మెరుగుపరుస్తున్నాయి మరియు అతిథులకు మరింత సౌకర్యమూ అందిస్తున్నాయి. మా విస్తరణ ప్రణాళిక ప్రధానంగా ప్రీమియం హోటల్స్‌ వృద్ధిపై దృష్టి సారించి ఈ ధోరణికి అనుగుణంగా ఉంటుంది’’ అని అన్నారు.