శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (11:01 IST)

రాజేంద్ర నగర్‌‍లో ఘోర అగ్నిప్రమాదం... పక్కనే స్కూల్..

bus fire
ఇటీవలికాలంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అగ్నిప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా రాజేంద్ర నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు డీసీఎం వాహనాలు దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక పాఠశాల ఉంది. ఇందులో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా, విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 
 
రాజేంద్ర నగర్‌లోని శాస్త్రి నగర్‌లో ఓ తుక్కు గోదాంలో వ్యర్థ పదార్థాలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలేరేగాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు, అగ్నిమాపకదళ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్న పోలీసులు... అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పివేశాయి. ఈ గోదాంలో విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.