ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (11:33 IST)

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డీజిల్ ధరలు.. మోడీ కరుణించేనా?

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డీజిల్ ధరలు తీసుకుని రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుకు వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ విజ్ఞప్తి చేసింది. అలాగే, కొన్ని స్థానిక, రాష్ట్ర పన్నులనూ జీఎస్టీలో విలీనం చేయాలని కోరింది. ఈ మేరకు జీఎస్టీ మండలికి ఓ మెమోరాండంను అసోచామ్ గురువారం అందించింది. 
 
ప్రస్తుతం ఒకే దేశం - ఒకే పన్ను విధానం అమలవుతోంది. దీంతో చాలా వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. కానీ, పెట్రో ఉత్పత్తులను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకునిరాలేదు. గత రెండేళ్లుగా పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాలైన పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పి జీఎస్టీ పరిధిలోకి తీసుకునిరావాలని అసోచామ్ కోరుతోంది. 
 
విడిగా పన్నులు వేయడం వల్ల వ్యాపార నిర్వహణ ప్రభావితం అవుతున్నది అని సదరు మెమోరాండంలో మండలిని అసోచామ్ కోరింది. అలాగే మండీ పన్ను, స్టాంప్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్‌లనూ జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేసిం ది. ఇది వ్యాపారాల క్రమబద్ధీకరణకు దోహదం చేస్తుందన్నది. సీజీఎస్టీ, ఐజీఎస్టీ క్రెడిట్ల పునర్వినియోగం, రెస్టారెంట్లు, రియల్టీలకు జీఎస్టీపై వెసులుబాటు అంతర్జాతీయ లావాదేవీలపై పన్ను లెవీపట్ల స్పష్టత, క్రమబద్ధీకరణలనూ మెమోరాండంలో అసోచామ్ ప్రస్తావించింది.