బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (10:30 IST)

సామాన్యులకు చుక్కలు.. పెరుగుతున్న పెట్రోల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తద్వారా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనం నడపాలంటేనే వణికిపోతున్నారు. సెంచరీ దాటిన పెట్రోల్ ధరను చూసి పొదుపుగా వాహన ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. గురువారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.28గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.74 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.54గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 101.03గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.79గా ఉంది.