సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2016 (20:04 IST)

త్వ‌ర‌లో మ‌ళ్ళీ పెట్రోలుకు క‌ట‌క‌ట‌... బంకులు బంద్

విజ‌యవాడ ‌: పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం ప్రభుత్వంపై నిర‌స‌న‌తో మ‌రోసారి దేశవ్యాప్తంగా బంద్‌కు సిద్ధం అవుతోంది. త‌మ క‌మీష‌న్ల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణ‌యించింది. ఈ నెల 19, 26 తేదీలలో సాయంత్రం పెట్రోలు అమ్మకాలు నిలిపివేస్తున్న‌ట్లు సంఘం

విజ‌యవాడ ‌: పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం ప్రభుత్వంపై నిర‌స‌న‌తో మ‌రోసారి దేశవ్యాప్తంగా బంద్‌కు సిద్ధం అవుతోంది. త‌మ క‌మీష‌న్ల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణ‌యించింది. ఈ నెల 19, 26 తేదీలలో సాయంత్రం పెట్రోలు అమ్మకాలు నిలిపివేస్తున్న‌ట్లు సంఘం ప్ర‌తినిధులు తెలిపారు. వ‌చ్చే నెల‌ నవంబర్ 3, 4 తేదీల్లో ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేస్తామ‌ని, నవంబర్ 5 సాయంత్రం 6 గంటలకు అమ్మ‌కాలు జ‌ర‌ప‌మ‌ని అన్నారు. 
 
వ‌చ్చే నెల 6న పెట్రోల్ బంక్‌లు పూర్తిగా మూసివేస్తామ‌ని అల్టిమేటం జారీ చేశారు. ప్ర‌తి నెల 2వ‌, 4వ శనివారాలు, ప్రతి ఆదివారం బంకులు బంద్ చేస్తారు. ఇలాగే మామూలు సెలవు రోజుల్లోనూ పెట్రోల్ అమ్మకాలు జరపమని స్ప‌ష్టం చేశారు. త‌మ హక్కులపై ఎన్నిసార్లు మనవి చేసుకున్నా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేదని పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ విశ్లేషించారు. అందుకే పెట్రోలు బంద్‌కు సిద్ధం అవుతున్నామ‌ని చెప్పారు.