శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 జులై 2024 (18:32 IST)

మహేంద్ర మునోత్‌ను చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా నియమించిన పీఎన్‌బీ మెట్‌లైఫ్

image
భారత్‌లోని ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన పీఎన్‌బీ మెట్‌లైఫ్, మహేంద్ర మునోత్‌ను చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించినట్లు ప్రకటించింది. కస్టమర్లతో మా టచ్‌పాయింట్లు అన్నింటిలోనూ నిరంతర మెరుగుదల కోసం స్థిరమైన నిర్వహణకు ఆయన నాయకత్వం వహించనున్నారు.
 
లైఫ్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ఉన్న విస్తృతమైన అనుభవాన్ని మహేంద్ర తన బాధ్యతలకు జోడించనున్నారు. 2015లో పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో చేరినప్పటి నుంచి, ఆయన టెక్నికల్ ఆపరేషన్స్ డైరెక్టర్‌తో సహా వివిధ నాయకత్వ బాధ్యతల్లో సేవలందించారు.
 
‘‘మహేంద్రను పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ చీఫ్ ‌ఆపరేటింగ్ ఆఫీసర్‌గా స్వాగతిస్తునందుకు మేము చాలా సంతోషిస్తున్నాము’’ అని పీఎన్‌బీ మెట్‌లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సమీర్ బన్సాల్ పేర్కొన్నారు. ‘‘అతని నిరూపితమైన నాయకత్వం, పరిశ్రమకు సంబంధించిన పరిజ్ఞానం, ఇంకా సమర్థత పట్ల నిబద్ధత అనేవి కస్టమర్లకు అసమానమైన విలువను అందించాలన్న మా విజన్‌తో సజావుగా సరితూగుతాయి. అతని నియామకం మా నిర్వహణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది, అలాగే నిలకడైన వృద్ధికి దారితీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
 
మహేంద్ర మాట్లాడుతూ, ‘‘పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఆపరేషన్స్ టీమ్‌కు నాయకత్వం వహించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. సామర్థ్యాన్ని, కస్టమర్ కేంద్రీకృత విధానాన్ని మెరుగుపరచడానికి, అలాగే మా విలువైన కస్టమర్లకు సజావుగా సేవలందించేందుకు మా టీమ్‌తో కలిసి పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నాను’’ అని చెప్పారు.