ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (21:17 IST)

ఇన్ఫినిటీ లెర్న్‌ బైకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా హిట్ మ్యాన్

శ్రీ చైతన్యకు చెందిన ఆన్‌లైన్‌ ఎడ్‌టెక్‌ సంస్థ ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్యకు క్రికెటర్‌ రోహిత్‌ శర్మను బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహారించనున్నారు. ఇన్ఫినిటీ లెర్న్‌ యొక్క బహుళ మార్కెటింగ్‌ ప్రచారాలతో పాటుగా బ్రాండ్‌ కార్యకలాపాలకు ఆయన్ను ఉపయోగించుకోనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. 
 
రోహిత్‌ శర్మతో భాగస్వామ్యం ద్వారా తమ బ్రాండ్‌ గుర్తింపును మరింత శక్తివంతం చేసుకోవడంతో పాటుగా భారతదేశంలో ఎక్కువ మంది కోరుకునే ఎడ్‌ టెక్‌ బ్రాండ్‌గా నిలువాలని కోరుకుంటున్నామని ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య సిఇఒ ఉజ్వల్‌ సింగ్‌ తెలిపారు.