శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (11:40 IST)

ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త... పెరిగిన వడ్డీరేట్లు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త  చెప్పింది. ఎఫ్.డిలపై చెల్లించే వడ్డీరేట్లను పెంచుతున్నట్టు పేర్కొంది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్.డిలపై వడ్డీ రేటును 20 నుంచి 40 బేసిన్ పాయింట్లు పెంచింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
ఈ మేరకు ఎస్.బి.ఐ తన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన చేసింది. రూ.2 కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి యేడాదికి కంటే తక్కువ వ్యవధి కల ఎఫ్.డిలపై 20 బేసిన్ పాయింట్లను పెంచినట్టు తెలిపింది. దీంతో మార్చి 10వ తేదీ నుంచి అధిక వడ్డీ లభించనుంది. అలాగే, సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్.డి.లపై వడ్డీ రేటును 3.60 శాతం నుంచి 3.80 శాతం మేరకు పెంచినట్టు పేర్కొంది.