శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:16 IST)

సొంతింటి కల నెరవేరాలనుకునే వారికి ఓ శుభవార్త..

సొంత ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త. ఎస్‌బిఐ ఇప్పుడు సొంత ఇంటి కలను నిజం చేయడానికి తన వంతు సాయం చేస్తోంది. అప్పు చేసి అయినా సొంత ఇంటిని నిర్మించుకోవలానుకునే మధ్య తరగతి ప్రజలకు ఈ ఆఫర్ బాగా సహాయపడుతుంది.
 
సాధారణంగా గృహ రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుతో పాటుగా లీగల్, టెక్నికల్ ఛార్జీలను కూడా విధిస్తాయి. ఈ ఛార్జీల వల్ల చాలా మందిపై అదనపు భారం పడుతోంది. వినియోగదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు ఎస్‌బిఐ ఈ అదనపు ఛార్జీలను తొలగించింది. అయితే ఈ అవకాశం ఫిబ్రవరి 28లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఇదే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును తగ్గించడంతో ఎస్‌బిఐ గృహ రుణాలపై వడ్డీని కూడా కొంతమేర తగ్గించింది. అయితే ఈ తగ్గింపు రూ.30 లక్షలలోపు రుణం తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నది.