సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (11:13 IST)

సీబీడీటీ నిబంధన మేరకు ఇంట్లో బంగారం ఎంత మేరకు దాచుకోవచ్చు?

gold
మహిళలకు అలంకార ప్రాయమైన బంగారు ఆభరణాలు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. పరిమితికి మించిన బంగారం ఇంట్లో దాచుకునివుంటే దానికి పన్ను చెల్లించాల్సివుంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం బంగారం కొనడానికి వెచ్చిస్తున్న మొత్తం ఎలా సంపాదించారన్న దానిపై పన్ను ఎంత పడుతుందనేది ఆధారపడివుంటుంది. 
 
వ్యవసాయం, ఇంట్లో పొదువు చేసిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేసినా, వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణలాపైనా ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. చట్ట ప్రకారం ఓ వివాహిత తన ఇంట్లో 500 గ్రాముల బంగారాన్ని దాచుకోవచ్చు. అదే అవివాహిత విషయానికి వస్తే 250 గ్రాముల బంగారం నగలు కలిగివుండొచ్చు. 
 
ఈ పరిధిలోపల ఉంటే మాత్రం ఎలాంటి పన్నులు చెల్లించనక్కర్లేదు. అలాగే, సోదాల్లో ఈ పరిమితిలోపే బంగారం లభిస్తే దానిని సీజ్ చేయడానికి వీల్లేదు. వెల్లడించిన ఆదాయంతో కొనుగోలుచేసిన బంగారం నిల్వ ఉంచుకోవడానికి ఎలాంటి పరిమితి లేదు.