శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (09:32 IST)

అకౌంటెంట్ కీచకుడైతే ... అతను రా'బంధు'గా మారాడు..

rape
హైదరాబాద్ నగరంలోని గ్రేస్ అనాథాశ్రమానికి చెందిన నలుగురు బాలికల మిస్సింగ్ కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆశ్రయంలో అకౌంటెంట్‌గా పని చేసే మురళి అనే కామాంధుడు కీచకుడు అవతారమెత్తాడు. అతని నుంచి తప్పించుకున్న బాధిత బాలికలు బంధువుల ఇంటికి వెళితే ఆ బంధువు రా'బంధు'గా మారాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నేరేడ్‌మెట్ జేజే నగరులో విక్టర్ ఇమ్మాన్యుయల్, భావన అనే దంపతులు గత 13 యేళ్లుగా గ్రేస్ అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. ఇదే ఆశ్రమంలో ఉండి ఉన్నత విద్యను అభ్యసించిన మురళి అనే యువకుడు ఇక్కడే అకౌంటెంట్‌గా చేరాడు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉండే బాలికలపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఓ బాధిత బాలిక మేజర్ అయింది. ఆమెకు మురళి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. అతని వేధింపులు భరించలేక ఆమె ఆశ్రయం నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంది. ఆశ్రమంలోని ఓ బాలిక.. తనకు సంగారెడ్డిలో బంధువులు ఉన్నారని అక్కడకు వెళ్దామని చెప్పి, ఈ నెల 19వ తేదీన మరో ముగ్గురు బాలికలతో కలిసి పారిపోయింది. 
 
వీరంతా సికింద్రాబాద్ వరకు వెళ్లాక.. వారిలో ఇద్దరు బాలికలు మాత్రం సంగారెడ్డి వెళ్లేందుకు నిరాకరించి, అక్కడే ఉండిపోయారు. దీంతో సంగారెడ్డిలో బంధువులున్న బాలిక, మేయర్ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంగారెడ్డిలో వీరికి ఆశ్రయం ఇచ్చిన బంధువు గణేశ్.. రాబంధుగా మారాడు. తన బంధువైన బాలిక, యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఈ క్రమంలో ఆశ్రమంలో నలుగురు కనిపించడం లేదంటూ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అకౌంటెంట్ మురళి, గణేష్‌లను అరెస్టు చేశారు. నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.