గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 అక్టోబరు 2022 (21:06 IST)

ఈ దీపావళికి బంగారం కూడబెట్టటానికి మంచి సమయం

gold price
బంగారం, వెండి ధరలకు సంబంధించి 2022 చాలా చంచలమైన సంవత్సరముగా నిలిచింది. దేశీయంగా రెండు లోహాలు వైటిడి ప్రాతిపదికన వరుసగా 5% మరియు -9% రిటర్న్స్ అందించాయి. భౌగోళిక రాజకీయాలు, కేంద్ర బ్యాంకుల చర్య, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఈ విలువైన లోహాలను నడిపించడమే కాకుండా ఇతర ఆస్తి వర్గాలలో కూడా చంచలత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి.
 
ఒకవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే ఉద్దేశముతో తీవ్రమైన వేగముతో వడ్డీ రేటును పెంచటానికి ఫెడ్ తొందరపడుతోంది. మరొకవైపు, రష్యా-ఉక్రెయిన్ మరియు ఇతర ఆర్థిక వ్యవస్థల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు ఆర్ధిక వ్యవస్థలో ప్రమాదాలను మరింత పెంచుతున్నాయి. ఇవన్నీ విశ్వవ్యాప్త అభివృద్ధి వేగాన్ని ప్రశ్నిస్తున్నాయి, ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా దీనిపై తమ ప్రణాళికలను తగ్గించాయి.
 
భారతదేశము బంగారం మరియు వెండి యొక్క అతిపెద్ద వినియోగదారు, ఇది బీమా వనరుగా మాత్రమే కాకుండా, ఆభరణాలు, నాణాలు మరియు కడ్డీల రూపములో పెట్టుబడిగా కూడా ఉపయోగించబడుతుంది. ధరలకు మద్ధతును ఇచ్చే అభివృద్ధి చాలా జరిగింది, ముఖ్యంగా దేశీయంగా గిఫ్ట్ సిటి ఏర్పాటు చేయడం, యుఏఈ- భారతదేశాల మధ్య ఎఫ్‎టిఏ సంతకం చేయడం వంటి ప్రభుత్వ ప్రయత్నాలు, దిగుబడి సుంకంలో మార్పులు.
 
రేటు పెంపు
ఈ సంవత్సరం లోహాల ధరల కంటే మ్యాక్రో ఫాక్టర్స్ పైచేయిగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నాము, ఎందుకంటే కఠినతరమైన మానిటరీ విధానము బంగారం వంటి నాన్-యీల్డింగ్ ఆస్తికి ఒక గొప్ప దశ కాదు. ఈ విశ్లేషణను సమర్థించటానికి, మేము గత 10 సంవత్సరాల దీపావళి నెల రిటర్న్స్‌ను పోల్చి చూశాము. 2013 సంవత్సరములో టేపర్ టాంట్రం ప్రకటించబడింది, 2015- 2018 రేట్ హైక్ సైకిల్ ఉండింది, 2019- 2021 అతి తక్కువ వడ్డీ రేట్ జోన్ ఉండింది. 2022 మళ్ళీ రేట్ హైక్ పరిస్థితి ఉంది. రేట్ హైక్ పరిస్థితిలో, బంగారానికి దీపావళి నెల రిటర్న్ ప్రతికూలంగా ఉండింది.
 
ప్రస్తుతం బుల్స్ మరియు బేర్స్ మధ్య గొడవలో ఇరుక్కున్న బంగారం ధర ధోరణిని గమనించడం ముఖ్యం అవుతుంది. తీవ్రమైన ప్రతికూలత బంగారాన్ని కొనుగోలు చేయటానికి బేరసారాలను ప్రేరేపించవు మరియు మధ్యస్త నుండి దీర్ఘకాల పెట్టుబడిదారుడు ఒక విశాలమైన చిత్రాన్ని చూడడం ముఖ్యము అవుతుంది. కొన్ని క్రుంగుబాట్లు మినహా, బంగారానికి మొత్తమ్మీది ధోరణి సానుకూలంగానే ఉంది మరియు రిటర్న్స్ చాలా బాగున్నాయి.
-మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్