గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (19:14 IST)

జిన్నాపై కాంతారా ఎఫెక్ట్.. మంచు విష్ణుకు టెన్షన్ తప్పేలా లేదుగా!

Ginna
Ginna
దీపావళికి సినీ ప్రేక్షకులకు పండుగే. దీపావళి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మంచు విష్ణు నటించిన జిన్నా మూవీపై విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అలాగే విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. హీరో కార్తి నటించిన సర్దార్ సినిమా కూడా ఈ రేస్‌లో ఉంది. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమా కూడా దీపావళికి రానుంది. అయితే జిన్నా తప్పకుండా దీపావళికి హిట్ కొడుతుందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. 
 
అయితే కాంతార సినిమాతో జిన్నా హిట్ కొడుతుందా తేలిపోతుందా అనే టెన్షన్ విష్ణుకు వుంది. ఎందుకంటే యునానియస్ బ్లాక్ బస్టర్ ఈ కాంతార సినిమా.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సినిమా కేవలం వారం రోజుల్లో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. కాంతార సినిమా క్రేజ్ ఇంకో రెండు వారాలపాటు ఉండేలాగా ఉంది. దీంతో జిన్నా హిట్ అవుతుందా అనే టెన్షన్‌లో వున్నాడు విష్ణు. మరి ఈ సినిమాకు ఎంత క్రేజ్ వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.