ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 జూన్ 2024 (17:33 IST)

సమర్ధమంతమైన వరి సాగు కోసం ఏపీ, తెలంగాణ రైతులకు అధునాతన పడ్లింగ్ సొల్యూషన్స్‌తో స్వరాజ్

swaraj
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ప్రత్యేకంగా మాగాణి నేలల్లో సాగులో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ సమగ్రమైన పడ్లింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. స్వరాజ్ 843 ఎక్స్ఎం, 742 ఎక్స్‌టీ, 744 ఎఫ్ఈ, స్వరాజ్ 855 ఎఫ్ఈ అనే స్వరాజ్ మోడల్స్‌లో అధునాతన ఫీచర్లు పొందుపర్చబడ్డాయి. ఇవి అధిక సామర్ధ్యంతో, మెరుగైన నియంత్రణతో, ఉపయోగించేందుకు మరింత సులభతరంగా ఉంటాయి. తద్వారా రైతులకు పడ్లింగ్ పనుల్లోను, వరి సాగులోను ఇవి సరైన ఎంపిక కాగలవు.
 
స్వరాజ్ ట్రాక్టర్లు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తాయి. తడి, బురద నేలల్లో కూడా ఇవి అత్యుత్తమ కర్షణ సామర్ధ్యాన్ని అందిస్తాయి. పనులు నిరాటంకంగా సాగేందుకు, జారి పడే సమస్యలు తలెత్తకుండా ఇవి సమర్ధంగా పని చేస్తాయి. అంతేగాకుండా, ఇండిపెండెంట్ పవర్ టేక్-ఆఫ్ (ఐపీటీవో) వల్ల పీటీవో-చాలిత సాధనాలపై పూర్తి నియంత్రణ లభిస్తుంది. అలాగే పనితీరు, విశ్వసనీయత కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ ట్రాక్టర్లలో 12 ఫార్వర్డ్, 3 రివర్స్ గేర్లతో విస్తృతమైన స్పీడ్ శ్రేణి ఉంటుంది. ఇవి అధిక టార్క్‌నిస్తూ (torque) వివిధ నేలల పరిస్థితులు, అవసరాలకు అనుగుణమైన పనితీరును అందిస్తాయి. మల్టీ-స్పీడ్ పీటీవో (ఎంఎస్‌పీటీవో), రివర్స్ పీటీవో ఆప్షన్ల వల్ల సవ్య, అపసవ్య దిశల్లో కూడా సులువుగా తిరిగేందుకు వీలవుతుంది. వివిధ సాధనాలను ఉపయోగించడంలో ఇది సహాయకరంగా ఉంటుంది.
 
అంతే కాకుండా, గరిష్ట పడ్లింగ్ వేగాలను అందించేందుకు, సమర్ధమంతమైన-ప్రభావవంతమైన పడ్లింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సౌత్ స్పీడ్ వేరియంట్‌ను స్వరాజ్ అందిస్తోంది. వినూత్నమైన 1-R గేర్ సెటప్‌ను ఫార్వర్డ్ గేర్‌కి ఎదురుగా ఉంచడం వల్ల ఫార్వర్డ్, రివర్స్ గేర్లను మార్చడం వేగంగా, సులభతరంగా ఉంటుంది. చిన్న ప్రదేశాల్లోనూ తిప్పేందుకు వీలవుతుంది. టర్నింగ్ రేడియస్‌ను మెరుగుపర్చడం వల్ల స్వరాజ్ ట్రాక్టర్లు సన్నని మలుపుల్లోనూ సులువుగా తిరగగలవు. చిన్న వ్యవసాయ క్షేత్రాల్లోనూ సమర్ధమంతంగా పనిచేయగలవు. మొత్తం ఉత్పాదకతను మెరుగుపర్చగలవు.
 
రైతుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ పనితీరును అందించే విశ్వసనీయమైన వ్యవసాయ యంత్రాలను అందించేందుకు స్వరాజ్ కట్టుబడి ఉంది. నాణ్యత, కస్టమర్ సంతృప్తి విషయంలో స్వరాజ్ ట్రాక్టర్స్‌కి గల నిబద్ధతను తెలియజేస్తూ ఈ ట్రాక్టర్లకు ఆరేళ్ల వారంటీ ఉంటుంది. రైతులకు తోడ్పాటునివ్వడంలో బ్రాండ్ నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ వారంటీ రైతాంగానికి విశ్వసనీయతకు, భరోసాకు పూచీకత్తుగా నిలవగలదు.