టాటా గ్రూప్ ఛైర్మన్ టీసీఎస్ సీఈఓ ఎన్.చంద్రశేఖరన్
టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత ఆ స్థానంలో నూతన ఛైర్మన్‌ను ఎన్నుకునే పనిలో పడింది టాటా గ్రూప్. కమిటీ పరిశీలనలో టీసీఎస్ సీఈవో ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ లాండ్ రోవర్ అధిన
టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత ఆ స్థానంలో నూతన ఛైర్మన్‌ను ఎన్నుకునే పనిలో పడింది టాటా గ్రూప్. కమిటీ పరిశీలనలో టీసీఎస్ సీఈవో ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ లాండ్ రోవర్ అధినేత రాల్ఫ్ స్పెత్, ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్ నోయల్ టాటా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరికల్లా కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనున్నామని కమిటీ తెలిపింది.
ఇదిలావుండగా, టాటా గ్రూప్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక పరిణామాలతో స్టేక్ హోల్డర్లంతా తీవ్ర ఆయోమయంలో ఉన్నారనీ, అందువల్ల టాటా గ్రూప్ ఈ పరిణామాలపై మరింత స్పష్టత ఇవ్వాలని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా (ఐఐఎఎస్) సూచించింది. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని బోర్డు అర్థంతరంగా తొలగించడం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దరిమిలా రతన్ టాటాపైనా, కొందరు బోర్డు సభ్యులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ టాటా సన్స్ బోర్డుకు మిస్త్రీ ఒక లేఖ రాశారు. ఈ ఆరోపణలు తిప్పికొడుతూ టాటా గ్రూప్ కూడా స్పందించింది. అయితే, ఈ ఆకస్మిక పరిణామాలతో టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డర్లు, రుణాలిచ్చిన బ్యాంకులు, ఉద్యోగులు, ఇతర స్టేక్ హోల్డర్లలో తీవ్రమైన ఆయోమయం నెలకొని ఉందని ఐఐఎఎస్ పేర్కొంది.