సైరన్ మిస్త్రీ లేఖాస్త్రంతో ఇన్వెస్టర్ల ప్యానిక్.. టాటా గ్రూపు మొత్తం నష్టం రూ.40 వేల కోట్లు
టాటా సన్స్ ఛైర్మన్ గిరి నుంచి అర్థాంతరంగా తొలగించిన సైరన్ మిస్త్రీ టాటా బోర్డుకు సంధించిన ఈమెయిల్ లేఖాస్త్రంతో టాటా కంపెనీ షేర్ల విలువ ఒక్కసారి పడిపోయింది. ఫలితంగా టాటా గ్రూపు ఇప్పటివరకు రూ.40 వేల కోట
టాటా సన్స్ ఛైర్మన్ గిరి నుంచి అర్థాంతరంగా తొలగించిన సైరన్ మిస్త్రీ టాటా బోర్డుకు సంధించిన ఈమెయిల్ లేఖాస్త్రంతో టాటా కంపెనీ షేర్ల విలువ ఒక్కసారి పడిపోయింది. ఫలితంగా టాటా గ్రూపు ఇప్పటివరకు రూ.40 వేల కోట్ల మేరకు నష్టాలను చవిచూసింది.
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరన్ మిస్త్రీని టాటా బోర్డు తొలగిస్తూ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశ పారిశ్రామిక దిగ్గజాలను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో.. తనను అర్థాంతరంగా తొలగించడం అన్యాయమంటూ టాటా బోర్డుకు సైరన్ మిస్త్రీ ఈమెయిల్ లేఖాస్త్రాన్ని సంధించాడు.
అంతేకాకుండా, వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ 18 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.18 లక్షల కోట్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, వరుసగా మూడవ రోజు కూడా టాటా గ్రూప్ కంపెనీల ఈక్విటీలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోయాయి.
ముఖ్యంగా టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బీవరేజస్, టాటా కాఫీ, టాటా ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్, టాటా టెలీ సర్వీసెస్, టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలు గురువారం 5 నుంచి 13 శాతం వరకూ నష్టాల్లో నడుస్తున్నాయి. అదేసమయంలో మిస్త్రీ బహిష్కరణ తర్వాత టాటా గ్రూప్ కంపెనీలకు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల నష్టం సంభవించింది.