శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

పండుగ సీజన్ తర్వాత దిగివస్తున్న పసిడి ధరలు

దేశంలో దీపావళి పండుగ సీజన్ పూర్తయింది. దీంతో బంగారం, వెండి ధరలు కిందికి దిగివస్తున్నాయి. మంగళవారం పెరిగిన పసిడి ధరలు.. బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పట్లో తగ్గినప్పటికీ మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,270 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,390 ఉంది.
 
అలాగే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,100గా ఉంది.