ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (09:35 IST)

తుఫాన్ ప్రభావం... పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. 
 
దక్షిణ మధ్య రైల్వే మీదుగా ఇతర రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. ఈ రైళ్లను ఒక్కో రోజు పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. రద్దయిన తేదీలు 24-30 మధ్య ఉన్నాయి.
 
ఈ నెల 24న హజ్రత్‌ నిజాముద్దీన్‌-సంత్రగచ్చి(02767), హౌరా-యశ్వంతపూర్‌ (02863), హౌరా-వాస్కోడిగామా(08047), 26న సంత్రగచ్చి-హజ్రత్‌ నిజాముద్దీన్‌(02768), 27న తిరువనంతపురం-షాలిమార్‌ (02641), హౌరా-తిరుచునాపల్లి(02663), చెన్నై సెంట్రల్‌-సంత్రగచ్చి(02808), వాస్కోడిగామా-హౌరా(08048), 27, 28 తేదీల్లో పాట్నా-యర్నాకులం(02644), 28న పురులియా-విల్లిపురం(06169), హౌరా-మైసూరు(08117), 29న కన్యాకుమారి-హౌరా(02666), తాంబ్రం-జసిదిహ్‌(02375), యశ్వంతపూర్‌-హౌరా(06597), హౌరా-యర్నాకులం(02877), 30న హౌరా-పుదుచ్చేరి(02867) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది