మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జులై 2020 (13:15 IST)

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 28న జేఈఈ పరీక్షలు.. నైపర్ ప్రకటన

Online Exams
జేఈఈ పరీక్షా తేదీని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్‌) ప్రకటించింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 28వ తేదీన ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామని నైపర్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మా, ఎంఎస్ ఫార్మా, ఎంటెక్ ఫార్మా, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 14న జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాడు. కరోనాతో జూలై 25కు వాయిదా పడిన ఈ పరీక్షలను అదే రోజున నిర్వహించుటకు కుదరకపోవడంతో పరీక్ష మరోమారు వాయిదాపడింది. తాజాగా పరీక్షను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలకోసం అధికార వెబ్‌సైట్ niperahm.ac.in చూడవచ్చని నైపర్ వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈని అహ్మదాబాద్‌లోని నైపర్ నిర్వహిస్తోంది.
 
నైపర్ జేఈఈ ద్వారా అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, హాజీపట్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్ఏఎస్ నగర్‌లోని నైపర్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లో మాస్టర్ ఇన్ ఫార్మసీ (ఎంఫార్మా), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ ఫార్మా), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్ ఫార్మా), పీహెచ్‌డీ ప్రోగామ్‌ల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీల్లో 820 సీట్లు అందుబాటులో ఉన్నాయి.