గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (10:36 IST)

హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.42,000ల వరకు శాలరీ

Jobs
హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 
 
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌/ ఎంఈ (మెకానికల్/కెమికల్/థర్మల్/ పవర్‌ప్లాంట్ ఇంజినీరింగ్‌)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
 
మొత్తం ఖాళీల సంఖ్య: 2
 
పోస్టుల వివరాలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
 
వయస్సు: జూన్‌ 12, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
 
వ్యవధి: 3 సంవత్సరాలు
 
స్టైపెండ్: నెలకు రూ.35,000ల నుంచి రూ.42,000ల వరకు చెల్లిస్తారు.
 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 20, 2022.