గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (14:44 IST)

భారీ భద్రత మధ్య హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్

salman khan
ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌ను చంపేస్తామంటూ బిష్ణోయ్ తెగకు చెందిన కొందరు హెచ్చరించారు. ఇటీవల పంజాబ్‌లో హత్యకు గురైన ప్రముఖ గాయకుడు సిద్ధూను హత్య చేసింది కూడా ఈ తెగగు చెందినవారేనని తేలింది. ఇపుడు వీరి సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపుపై సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
 
ఇదిలావుంటే, తన కొత్త చిత్రం  కబీ ఈద్ కబీ దివాలి షూటింగ్ హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్ బుధవారం నగరానికి వచ్చారు. గతంలో ఎన్నడూ లేనంత భద్రతను సల్మాన్ ఖాన్‌కు కల్పించారు. విమానాశ్రయం నుంచి ఆయన కట్టుదిట్టమైన భద్రత నడుమ ఫిల్మ్ సిటికీ చేరుకున్నారు.