శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (13:08 IST)

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్

rape
హైదరాబాదులో పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కొడుకుతో సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు.
 
అయితే ఈ ఘటనపై అధికార టీఆర్ఎస్‌ పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని కాపాడుతున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. 
 
అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియాకు చూపించారు కూడా.
 
ఈ నేపథ్యంలో మైనర్లు ఉన్న ఫోటోలు, వీడియోలు మీడియా ముందు పెట్టారనే అభియోగంతో రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.