మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (18:02 IST)

నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ - శ్రీ‌ముఖి

Srimukhi, cooking
Srimukhi, cooking
భారతదేశంలో అత్యంత ఇష్టపడే బిబిక్యూ బఫే రెస్టారెంట్‌, అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ (ఎబిస్‌ గా  ప్రసిద్ది చెందింది) 2022 జూన్‌ 6 సోమవారం నాడు హైదరాబాద్‌లో తన 9వ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం ద్వారా మరో మైలురాయి సందర్భాన్ని జరుపుకున్నది. బంజారాహిల్స్‌లో అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌కు ఇది రెండవ అవుట్‌లెట్‌.  ఈ అవుట్‌లెట్‌ బంజారా హిల్స్‌ మరియు పరిసర ప్రాంతాల ఆహార ప్రియులైన అతిథులను ఖరీదైన మరియు ప్రీమియం ఇంటీరియర్‌తో అలరించనున్నది. ఈ అవుట్‌లెట్‌ను బుల్లితెర అందాలనటి శ్రీముఖి ప్రారంభించారు.
 
Srimukhi opening
Srimukhi opening
బంజారాహిల్స్‌లో ఎబిస్‌ను ప్రారంభించిన అనంతరం నటి & యాంకర్‌ శ్రీముఖి మాట్లాడుతూ, ఎబిస్‌ నాకు ఎంతో ఇష్టమైన రెస్టారెంట్‌ అన్నారు. ఎవరైనా ఈ రెస్టారెంట్‌ని సందర్శించవలసి వస్తే, మా కుటుంబంతో కలిసి వచ్చి, రెండు రోజులు ఉపవాసం చేసి రావాలి, ఎందుకంటే వారి ఆతిథ్యం వారు అందించే వాటికి అంతేలేదు, అవి చాలా రుచిగా ఉండడంతో, మీరు వాటిని తినడం కొనసాగించాలని భావిస్తారు. ఎంతవరకంటే మరుసటి రోజు ఏమి తినకపోయిన ఫర్వాలేదు అనిపించేంత.  బంజారాహిల్స్‌లో రెండవ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం బ్రాండ్‌ యొక్క ప్రజాదరణ ఎంతగా పెరుగుతోందో ప్రతిబింబిస్తున్నది. ఈ ప్రదేశం వాతావరణం ఎంతో ఉత్తేజకరమైనది. ఎబిస్‌లో నాకు బాగా నచ్చినది ఏమిటంటే, మీరు మీ ఆహారాన్ని మీకు ఇష్టమైన రీతిలో తయారు చేసుకోవచ్చు మరియు వివిధ రకాల ఆహారాన్ని అన్వేషించవచ్చు, అనేక స్టాల్స్‌ ఉన్నాయి, పిజ్జా, ఐస్‌ క్రీం మరియు మరిన్నింటి వాటితో, పిల్లలు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. ఎబిస్‌ ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా 55 అవుట్‌లెట్‌లను కలిగి ఉన్నారు మరియు దుబాయ్‌లో మూడు అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఇది వారి ప్రజాదరణకు కొలమానం మరియు పెరుగుతూనే ఉంది. నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ, ఇక్కడ వెజ్‌ మరియు నాన్‌ వెజ్‌ ఫుడ్‌ మరియు డెజర్ట్‌లు రుచికరమైనవి మరియు నోరూరించేవి అనేకం ఉన్నాయి.ఆతిథ్యంలో అత్యుత్తమ అర్హత కలిగిన హోటల్‌ సిబ్బంది, వాలెట్‌ పార్కింగ్‌, డిఐవై గ్రిల్‌, విష్‌ గ్రిల్‌ మరియు ప్రత్యేక కౌంటర్లు మరియు వీటన్నింటితో పాటు ఎబిస్‌ తన వ్యక్తిగతీకరించిన సేవా వ్యవస్థను ఈ అవుట్‌లెట్‌లో సరికొత్త ప్రమాణాలకు తీసుకువెళుతుంది. అబ్సల్యూట్‌ బార్బెక్యూల పాకశాస్త్ర తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అవుట్‌లెట్‌ నిశితంగా రూపొందించబడిరది. విష్‌ గ్రిల్‌లో బ్రెజిలియన్‌ చురాస్కోతో కూడిన అనేక రకాల పరదేశీ మాంసాలతో, భారతీయ/ఖండాంతర మెయిన్‌లతో పాటు అంతులేని వివిధ రకాల స్టార్టర్‌లు, కోల్డ్‌ స్టోన్‌ క్రీమరీ మరియు చక్కటి డెజర్ట్‌ల ఎంపికతో, ఎబిస్‌ ప్రతి ఒక్కరికీ వారికి  ఇష్టమైన దానిని అందిస్తుంది.
 
‘‘మేము మా ప్రయాణాన్ని హైదరాబాద్‌ నుండి ప్రారంభించాము మరియు నగరంలో మా 9వ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం మాకు గర్వకారణంగా ఉన్నది. హైదరాబాద్‌ మాకు గొప్ప మార్కెట్‌, ఇక్కడి వినియోగదారులు మాకు ఎంతో మద్దతు అందించారు. బంజారాహిల్స్‌లో ఇప్పటికే ఉన్న అవుట్‌లెట్‌ ఇప్పటికే తన సామర్థ్యాన్ని చేరుకుంది మరియు ఇక్కడ డిమాండ్‌ పెరుగుతున్నది, కాబట్టి బంజారాహిల్స్‌లో రెండవ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం జరిగింది, ఇది మరింత విశాలమైనది, మా కస్టమర్ల అంచనాలకు మించి, కొత్త అవతార్‌లో తాజా రూపంతో మరియు మొదటి ఔట్‌లెట్‌ను అధిగమిస్తుందనే నమ్మకం ఉంది.’’ అని ఎబిస్‌, రీజినల్‌ హెడ్‌ - సౌత్‌ ఆపరేషన్స్‌ రితమ్‌ ముఖర్జీ అన్నారు.
 
‘‘బంజారాహిల్స్‌ వంటి బిజీ ఏరియాలో మేము రెండవ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం మా పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు మరియు ఆహారం పట్ల హైదరాబాదీల ప్రేమకు ఇది నిదర్శనం. ఇతర అవుట్‌లెట్‌లతో పోలిస్తే ఈ అవుట్‌లెట్‌ మరింత సువిశాలమైనది, మా కస్టమర్‌లను ఆహ్లాదపరిచే వాతావరణం ఇక్కడ ఉంది. సేవ మరింత వ్యక్తిగతీకరించబడిరది, వాలెట్‌ పార్కింగ్‌, డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ అనే భావనతో, ఇది కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఆహారాన్ని అనుకూలీకరించడానికి వీలు కల్పిస్తున్నది, హైదరాబాద్‌లో ఇది 9వ ఔట్‌లెట్‌ కాగా, బంజారాహిల్స్‌లో రెండోది. మేము మా బ్రాండ్‌ను 2013లో జూబ్లీహిల్స్‌లో ప్రారంభించాము మరియు హైదరాబాద్‌కు చెందిన ఈ బ్రాండ్‌ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. మేము అన్ని వైపులా ఉన్నాము. బంజారాహిల్స్‌లోని హిల్‌టాప్‌లో ప్రారంభమైన 55వ అవుట్‌లెట్‌ ఇది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో మేము మరో 20 అవుట్‌లెట్‌లను ప్రారంభించాలనుకుంటున్నాము మరియు సంవత్సరాంతానికి 75 అవుట్‌లెట్‌లను కలిగి ఉన్నాము.  హైదరాబాద్‌లోని వనస్థలిపురం, రాంచీ, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మరో 2 ఔట్‌లెట్లతో పాటు మరిన్ని ఔట్‌లెట్‌లను ప్రారంభిచబోతున్నాము. మరో మూడేళ్లలో మేము ఐపిఒకు వెళ్లనున్నాము. దేశంలోని బార్బెక్యూ రెస్టారెంట్ల పరిమాణం విలువ సుమారు రూ. 10000 కోట్లు. అని ఎబిస్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, రీతేష్‌ గడే అన్నారు.
 
అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌, ఆపరేషన్స్‌ ఎపి & టిఎస్‌, అభిలాష్‌,  విష్‌ గ్రిల్‌ కాన్సెప్ట్‌కు ఎబిస్‌ ప్రసిద్ధి చెందింది, ఇక్కడ మీరు మరియు మీ కుటుంబ సభ్యుల అభిరుచికి అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు.. ఎబిస్‌  వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది,  కుటుంబంలో  పుట్టినరోజు, వార్షికోత్సవం లేదా ఏ సందర్భమైనా కావచ్చు, ఈ సందర్భాలు జరుపుకునే ప్రత్యేకత కారణంగా. ఎబిస్‌ తాను అందించే సేవలు పట్టణంలోచర్చనీయాంశమైంది, చాలా మంది దీనిని తమ ఇంటికి దూరంగా ఉండే మరో ఇల్లుగా భావిస్తుంటారు, ఇక్కడ మేము మన ఇళ్లలో చేసినట్లుగా మా అతిథులను ఆనందపరుస్తాము.. మొత్తంమీద ఎబిస్‌ అత్యద్బుతమైన భోజన అనుభవం అందిస్తుంది, ఇది మా కస్టమర్లకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేము  తెలంగాణలో అవుట్‌లెట్లను తెరవాలనుకుంటున్న టైర్‌ టూ మరియు టైర్‌ త్రీ నగరాలలో వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విజయవాడ మరియు వైజాగ్‌లో ఔట్‌లెట్‌లు ఉండగా, త్వరలో రాజమండ్రి మరియు గుంటూరులో అవుట్‌లెట్‌లను ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నాము. హైదరాబాద్‌లో మరో వారం రోజుల్లో వనస్థలిపురం ఔట్‌లెట్‌ని ప్రారంభిస్తాం, తర్వాత ఏఎస్‌రావు నగర్‌, అత్తాపూర్‌లో కూడా ప్రారంభిస్తాం, మరో రెండు కూకట్‌పల్లి, మెహదీపట్నంలో ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతున్నది.