శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (11:12 IST)

13 ఏళ్ల బాలికను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి.. రాత్రంతా..?

victim girl
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో మైనర్ బాలికపై అరాచక ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి, రాత్రంతా ఆమెను వేరే చోట ఉంచిన ఘటన కలకలం రేపుతుంది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రుమేనియాకు చెందిన మైనర్ బాలికపై రాజకీయ నేతల కొడుకులు దారుణానికి ఒడిగట్టిన ఘటన మరువకముందే, మరో మైనర్‌ బాలిక(13)ను క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి, ఆ బాలికను ఓ రాత్రంతా వేరే చోట ఉంచి తిరిగి విడిచిపెట్టిన ఘటన ఓల్డ్ సిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సదరు క్యాబ్‌ డ్రైవర్‌ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
 
ఓల్డ్ సిటీలోని మొగల్‌పురా పీఎస్‌ పరిధికి చెందిన ఓ బాలిక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొగల్‌పురా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  
 
అయితే, మరుసటి రోజే ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. ఆ బాలికను విచారించగా.. లుక్మాన్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో మిస్సింగ్‌ కేసును కిడ్నాప్‌ కేసుగా మార్చిన పోలీసులు వెంటనే లుక్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.