గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

తమిళనాడులో ఏడుగురు యువతులను మింగేసిన వాగు

deadbody
తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వాగు ఏడుగురు యువతులను మింగేసింది. కెడిలం వాగులో ఈ ఏడుగురు అమ్మాయిలు మునిగిపోయారు. ఎండవేడిమిని తట్టుకోలేక వాగుల స్నానం చేసేందుకు ఈ ఏడుగురు యువతులు వెళ్లారు. వీరంతా వాగులో స్నానం చేస్తుండగానే ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. నలుగురు యువతులను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు యువతులు విగతజీవులయ్యారు. దీంతో మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. 
 
ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని కడలూరు జిల్లా కుచ్చిపాళెయంలోని కెడిలం వాగులో జరిగింది. ఈ వాగులోకి ఉక్కపోతను తట్టుకోలేక స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే ఉన్నట్టుండి వాగులో నీటి ప్రవాహం పెరగడంతో ఆ యువతులు నీటిలో మునిగిపోయారు. 
 
మృతులను సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోని,్ (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)లుగా గుర్తించారు. వీరంతా కుచ్చిపాళెయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ప్రియదర్శిని, దివ్యదర్శినిలు అక్కా చెల్లెళ్ళు. దీంతో వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలకు ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు.