భాగ్యనగరిలో బర్త్‌డే పార్టీకి పిలిచి అఘాయిత్యం
భాగ్యనగరిలో మరో దారుణం జరిగింది. బర్త్‌డే పార్టీకి పిలిచి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్డులో పట్టపగలు జరిగింది. ఈ అత్యాచారం కూడా కారులోనే జరగడం గమనార్హం. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేగంగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని ఆమ్నేషియా పబ్ వద్ద మైనర్ బాలికను అపహరించి కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైనంది. ఈ కేసులో పలువురు రాజకీయ ప్రముఖల పిల్లలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ రాజకీయ పార్టీకి చెందిన వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడితో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలావుంటే, సోమవారం మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు సురేష్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు పట్టపగలు నెక్లెస్ రోడ్డుపై చోటుచేసుకోవడం కలకలంరేపింది. ఓ మైనర్ బాలికను పుట్టిన రోజు వేడుకల పేరు చెప్పిన నెక్లెస్ రోడ్డుకు తీసుకొచ్చిన సురేష్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును త్వరతిగతిన ఛేదించారు.