మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (15:28 IST)

ముఖ్యమంత్రి ఎడప్పాడికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సునీల్

చెన్నై నగరంలో ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి, దానిద్వారా లక్షలాది మంది పేదలకు వివిధ రకాలైన సేవలను ఉచితంగా అందిస్తున్న ఆ ట్రస్ట్ ఫౌండర్, అన్నాడీఎంకే రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 
 
ముఖ్యంమత్రిని నగరంలో ఉన్న ఆయన నివాసంలో డాక్టర్ సునీల్ సారథ్యంలోని బృందం కలుసుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ బృందాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రత్యేకంగా అభినందిస్తూ, పార్టీ అభివృద్ధి కోసం మరింతగా కృషి చేయాలని సూచన చేశారు. 
 
కాగా, ముఖ్యమంత్రిని కలిసిన సునీల్ బృందంలో 133 వార్డు అమ్మా పేరవై సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, ట్రిప్లికేణి రాంప్రసాద్, జాకీర్ హుస్సేన్,  విజయరాం నటరాజన్, నక్కీరన్ నగర్ సురేష్ తదితరులు ఉన్నారు.