Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ రాసక్రీడను చూశాడనీ వాచ్‌మెన్‌ను చంపేశారు...

ఓ మహిళతో ఒక ఆటో డ్రైవర్ ఏకాంతంగా ఉన్న దృశ్యాన్ని చూశాడనీ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను చంపేశారు. ఈ దారుణం చెన్నైలోని కోడంబాక్కంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Written By pnr
Updated: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:46 IST)
ఓ మహిళతో ఒక ఆటో డ్రైవర్ ఏకాంతంగా ఉన్న దృశ్యాన్ని చూశాడనీ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను చంపేశారు. ఈ దారుణం చెన్నైలోని కోడంబాక్కంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నై, కోడంబాక్కం వరదరాజుపేట సమీపంలోని ఆరోగ్యస్వామి వీధికి చెందిన సుకుమార్‌ (55) అనే వ్యక్తి నుంగంబాక్కం మేల్‌పాడి ముత్తు వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇదే అపార్ట్‌మెంట్‌లో నివశించే లక్ష్మి (35) అనే మహిళతో అదేప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ హసీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 
 
వీరిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని వాచ్‌మెన్ చూసి వారిద్దరినీ మందలించాడు. దీంతో వాచ్‌మెన్‌పై అగ్రహం పెంచుకున్న ఆటో డ్రైవర్ ఆ మహిళతో కలిసి సుకుమార్‌ను హత్య చేశాడు. హత్యకు గురైన విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నుంగంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, లక్ష్మీ వద్ద ఆరా తీయగా, ఆమె పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానించి అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీంతో ఆటో డ్రైవర్ హాసీని కూడా అరెస్టు చేశఆరు. ఆటోడ్రైవర్‌ పథకం ప్రకారం సుకుమార్‌ను హత్య లక్ష్మి అంగీకరించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Anirudh and Kavya : గ్రీస్ లో అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం జరగనుందా ?

Nidhhi Agerwal: పుట్టినరోజున కొత్త చిత్రాన్ని ప్రారంభించిన నిధి అగర్వాల్

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ

Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments