ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (03:01 IST)

జయలలిత చికిత్సలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఏ విచారణకైనా రెడీ: అపోలో

దాదాపు ఆరునెలల మౌనం తర్వాత అపోలో హాస్పిటల్స్ అధినేత నోరు విప్పారు. కోట్లాది మంది తమిళుల హృదయాల్ని బద్దలు చేసిన మహానేత మరణం పట్ల సుదీర్ఘ మౌనం తర్వాత వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. జయలలిత వైద్య చికిత్సలో ఎలాంటి పొరపాటు తమనుంచి జరగలేదని, ఆమె మరణంపై ఏ

దాదాపు ఆరునెలల మౌనం తర్వాత అపోలో హాస్పిటల్స్ అధినేత నోరు విప్పారు. కోట్లాది మంది తమిళుల హృదయాల్ని బద్దలు చేసిన మహానేత మరణం పట్ల సుదీర్ఘ మౌనం తర్వాత  వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. జయలలిత వైద్య చికిత్సలో ఎలాంటి పొరపాటు తమనుంచి జరగలేదని, ఆమె మరణంపై ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పడానికి ముందుకొచ్చారు. 
 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వైద్య చికిత్సలలో ఎలాంటి పొరబాటు లేదని, ఆమె మరణంపై విచారణకు సిద్ధమని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా సేవలందించిన జయలలితకు 2016 సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థత ఏర్పడింది. 
 
దీంతో థౌజండ్‌లైట్స్‌ అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయిన ఆమెకు 70 రోజులకు పైగా చికిత్సలందించారు. ఆరోగ్యం కోలుకుంటున్నట్లు తెలుస్తుండగానే గత(2016) డిసెంబర్‌ 5న హఠాత్తుగా జయలలిత మృతి చెందారు. దీంతో ఆమె మృతిపై అనేక అనుమానాలున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె మృతిలో అనుమానం ఉందని, దీని గురించి న్యాయవిచారణ జరపాలంటూ ఓ.పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. 
 
దీనిపై అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మరణంపై ఎటువంటి విచారణ జరిపినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జయలలితకు అందచేసిన చికిత్సలలో ఎటువంటి పొరపాటు జరగలేదని ఆమె చికిత్సలలో ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు. 
 
అపోలో ఆసుపత్రితో సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా ఆ సంక్షోభ కాలంలో అనుసరించిన మౌర్మిక మౌనం వెనుక ఉన్న కుట్ర బద్దలు కావాల్సిందే. ఆ 75 రోజులు అపోలో ఆసుపత్రిలో ఏం జరిగిందన్న రహస్యం బయటకు రావలిసిందే.