Dharma Sangrah
✕

పిల్లలు రోజూ ఎంత మేరకు నీరు తాగాలి?

Updated: శుక్రవారం, 30 నవంబరు 2018 (20:11 IST)
శరీరంపైన మలినాలను తొలగించేది జల స్నానం అయితే, శరీరం లోపలి మలినాలను కడిగి జీవక్రియలకు తోడ్పడేది జలపానం. ఈ పంచభూతములలో గాలి తర్వాత స్థానం నీటిదే. ఆ తరువాతి స్థానం ఆహారానిది.
 
మన శరీరంలో అన్నిటికంటే నీరే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది. చివరికి మనం నివశించే భూభాగంలోనూ మూడింతలు నీరే ఉంది. అలాగే మన శరీరంలో కూడా దాదాపు 68 శాతం నీరు ఆక్రమించి వుంటే, కేవలం 32 శాతం మాత్రమే ఇతరాలు ఆక్రమించి ఉన్నాయి.  
 
కానీ ప్రస్తుత కాలంలో ఖరీదైన జీవితానికి అలవాటుపడిన మనిషికి నీటి ఆవశ్యకత తెలియక రోగాల పాలవుతున్నారు. నీటికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, లస్సీలు తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడువంతుల నీటిని పుచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఎప్పుడు, ఎలా పుచ్చుకోవాలంటే...?
* పెద్దలు కనీసం ఐదు లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు పుచ్చుకుంటే శరీరం సమతుల్యంగా ఉంటుంది.
* పిల్లల విషయానికొస్తే వారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు ఆహారాన్ని పుచ్చుకుంటారు, కాబట్టి వారు రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని పుచ్చుకోవాలి.
 
* ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు ఆహారాన్ని పుచ్చుకోవాలి.
* నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్థమూ పుచ్చుకోకూడదు.
 
* ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే పదార్ధాలను అంటే ఆకుకూర, పండ్లలో కూడా 70 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా పుచ్చుకోవాలి.

అన్నీ చూడండి

గుంటూరు మేయర్ పీఠంపై నటుడు జగపతిబాబు సోదరి - కుప్పంలో వైకాపాకు సున్నా

ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు ప్రజలకు ఉంటుంది : మద్రాస్ హైకోర్టు

ఇది చూస్తే పవన్ కల్యాణ్‌కి పూనకాలే, ఆదోనిలో జనసేన రెబల్ స్టార్, వీడియో

భారత్ లౌకిక దేశం : ఆ నటి వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేయండి : బాంబే హైకోర్టు ఆదేశం

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలకే తొలి ప్రాధాన్యత : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

Pocket Rockets trailer : ఇద్దరు స్నేహితులు జూదం తో తలరాతను మార్చుకున్నారా? పాకెట్ రాకెట్స్ ట్రైలర్

Ravi Dubey: రవీ దుబే లక్ష్మణుడి పోస్టర్ రామాయణం పై అంచనాలను పెంచుతోంది

Vishwak Sen: ఆడియన్స్ కు పిచ్చెక్కించే లవ్ స్టోరీ కథగా ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్‌ వచ్చేసింది

Tabu: కింగ్ 100 లో ఈసారి.. ఇది ప్రేమ కాదు అంటూ టబు ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం.. మేధా మేక లేదా శ్రీలీల.. ఇద్దరిలో ఎవరు?

తర్వాతి కథనం
Show comments