డ్రైఫూట్ బటర్ కేక్ తయారీ ఎలా?

బుధవారం, 15 అక్టోబరు 2014 (17:04 IST)
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... 100 గ్రాములు 
బేకింగ్ పౌడర్... అరచెంచా 
ఎండు ద్రాక్ష.. పది 
వెనిల్లా ఎసెన్స్... అర టీస్పూన్ 
బటర్... 50 గ్రాములు
చక్కెర పొడి...100 గ్రాములు.
గుడ్డు... రెండు
పాలు...ఒక కప్పు 
 
తయారీ విధానం :
ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటిపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి. తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి.
 
వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి శుభ్రం చేసిన ఎండు ద్రాక్షను చేర్చి, మైదాను కూడా కలిపి, అరకప్పు పాలు కలుపుకుంటే పిండి జారుగా తయారవుతుంది. జారుగా ఉండే, క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్‌లో పోసి 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌవ్ మీద నుంచి దించి కేక్‌పై చెర్రీ పండ్లతో కానీ, మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో, క్రీమ్‌తోనూ అలంకరించుకుని సర్వ్‌చేయొచ్చు. 

అన్నీ చూడండి

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.. భర్త ముఖంపై యాసిడ్ పోసింది.. జీవితఖైదు

తెలంగాణ సచివాలయంలో పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఊరుకోం : కేటీఆర్

తెలంగాణలో అధిక వర్షాలు - పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్

వరల్డ్ క్లాస్ ట్రాన్సిట్ హబ్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

రూ.కోట్లు ఉన్నా సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే ఏం లాభం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Show comments