సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (19:00 IST)

స్టార్టర్ స్పెషల్: గోబి డ్రై ఫై ఇంట్లోనే ట్రై చేయండి.

స్టార్టర్ అంటేనే హోటల్ గుర్తుకొస్తుంటే.. అంతేకాదు.. ఫిష్ ఫింగర్, పొటాటో ఫింగర్స్ వంటివి గుర్తుకొస్తున్నాయా.. న్యూట్రీషన్లు, క్యాలరీలు పుష్కలంగా కలిగివుండే గోబి డ్రై ఫ్రై రిసిపిని ట్రై చేయండి. డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా నోరూరిస్తుంటుంది. చిల్లీ గోబీ ప్రైని స్ప్రింగ్ ఆనియన్, చిల్లీ సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 
 
కావలసిన పదార్థాలు : 
కాలీప్లవర్ ముక్కలు - రెండు కప్పులు 
మైదా - నాలుగు టేబుల్ స్పూన్లు 
కార్న్ ఫ్లోర్ - ఒక టీ స్పూన్ 
బేకింగ్ సోడా - పావు టీ స్పూన్ 
జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్ 
రెడ్ చిల్లీ పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ 
సోయా సాస్ - అర టీ స్పూన్ 
వెనిగర్ - అర టీ స్పూన్
వెల్లుల్లి, అల్లం పేస్ట్ - ఒక టీ స్పూన్ 
ఆయిల్, ఉప్పు - తగినంత
నీళ్లు- రెండు కప్పులు 
చిన్న ఉల్లిపాయలు - (స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు)  - రెండు కప్పులు 
ధనియాల పొడి - ఒక టీ స్పూన్ 
ఛాట్ మసాలా - ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం:
ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ స్టార్చ్, బేకింగ్ పౌడర్, ధనియాలపొడి, రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, వెనిగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. అదే బౌల్లో ఒక కప్పు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని చిక్కగా జారుడుగా కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ నూనె కూడా అందులో వేయాలి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఎగ్ బీటర్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన మైదా మిక్స్‌కు వేడినీటిలో శుభ్రం చేసిన గోబీ ముక్కలను కలిపి గోబీకి పేస్ట్ బాగా పట్టే వరకూ మిక్స్ చేసుకోవాలి.
 
తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఫ్రైకి తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పిండిలో మిక్స్ చేసుకొన్న గోబిని కొద్దిగా కొద్దిగా తీసుకొని నిధానంగా వేసి డీఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీఫ్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యాక వాటిని తీసి టిష్యు పేపర్ మీద వేయాలి. 15నిముషాల తర్వాత గోబిని తిరిగి డీప్ ఫ్రై చేయాలి. పాన్‌లో నుండి తీసి టిష్యు పేపర్ మీద వేసి నూనె పీల్చుకొన్న తర్వాత సర్వ్ చేయాలి. 
 
ఇలా గోబి మొత్తం రెడీ చేసుకొన్న తర్వాత, వాటి మీద కొద్దిగా ఛాట్ మసాలను చిలకరించాలి. చాట్ మసాలా, గోబి బాగా మిక్స్ చేసి, తర్వాత స్ప్రిగ్ ఆనియన్, సన్నగా తరిగిన చిల్లీ, చిల్లీ సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేయాలి. దీన్ని సైడ్ డిష్‌గా సర్వ్ చేయవచ్చు. పిల్లలకు ఈ రిసిపీ బాగా నచ్చుతుంది.