Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కర్ ఎలా వాడాలంటే..?

Updated: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:38 IST)
కుక్కర్‌తో ఇబ్బందులు ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. కుక్కర్‌లో కొలత ప్రకారం నీటిని పోయాలి. కంటైనర్స్ ఒరగకుండా సరిగ్గా అమర్చాలి. పాత్రలు ఒరిగితే అందులోని పదార్థాలు కుక్కర్లో పడిపోయి, కుక్కర్‌లోని నీటితో ఉడకటం వలన కుక్కర్లోనీరు ఇంకిపోయి స్టేఫ్టీ వాల్వ్ బద్ధలవడం, వెయిట్ ఎగిరిపోయి కుక్కర్లోని పదార్థాలు పైకి చిమ్మటం లాంటివి జరుగుతాయి. 
 
గాస్కెట్ పాడయిపోతే, కుక్కర్ పక్కల నుంచీ ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అందువల్ల లోపలి పదార్థాలు ఉడకకపోగా ఎంతసేపటికీ విజిల్‌రాదు. కుక్కర్‌లోని నీరంతా అయిపోయి, సేఫ్టీవాల్వ్ పోతుంది. కుక్కర్‌మూత పక్కనుంచీ ఆవిరి బయటకు వస్తుంటే గాస్కెట్‌ను మార్చాలి. 
 
కుక్కర్‌లో పెట్టిన గిన్నెలలో ఆహార పదార్థాలను, బియ్యాన్ని పెట్టినప్పుడు ఆ పాత్రలలో నీరు అవి ఉడికించేందుకు సరిపడా పోయాలి. చిన్న గిన్నెలలో ఎక్కువ పదార్థాలను పెట్టడం వల్ల అవి సరిగ్గా ఉడకవు. లేదా పొంగి కుక్కర్లో పడతాయి. 
 
కుక్కర్లో మూతకున్న ఆవిరి రంధ్రం మూసుకుపోకుండా ప్రతిరోజు శుభ్రపరచాలి. అదేవిధంగా వెయిట్‌ని కూడా ప్రతిరోజు శుభ్రం చేయాలి. కుక్కర్లోంచి ఆవిరి త్వరగా రావటానికి, లోపలి పదార్థాలు ఉడకటానికి హెచ్చు మంటను పెట్టాలి. వెయిట్ పెట్టిన తర్వాత కూడా మంటలను తగ్గించకూడదు.
 
విజిల్ వచ్చిన తర్వాత మంటను తగ్గించి, ఆ తర్వాత మంటను తగ్గించి, ఆ తర్వాతే స్టౌను ఆర్పాలి. కుక్కర్‌ను దింపిన తర్వాత వెంటనే మూత తీయడానికి ప్రయత్నించకూడదు. దానివలన గ్యాస్‌కట్ దెబ్బతింటుంది.

అన్నీ చూడండి

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో సీఎంఈను ప్రారంభించిన తమిళనాడు అసెంబ్లీ స్పీకర్

మా అమ్మ ఏం పాపం చేసింది.. ఇంతగా అవమానించారు : బోరున విలపించిన కొండా సుస్మిత (Video)

వైఎస్ షర్మిలకు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?

బైబై నాన్నా... నా దగ్గరకు మీరు రాలేరు అంటూ నదిలో దూకేసిన యువతి, వీడియో

లొట్టలేసుకుని కేఎఫ్‌సీ చికెన్ లాగించేస్తున్నారా.... వామ్మో... (Video)

అన్నీ చూడండి

అసభ్యకరంగా చూపించే చిత్రాల్లో అస్సలు నటించను : కయదు లొహర్

కర్మ చక్రాలు తిరుగుతున్నాయి... రాబోయే కాలం నాది : తనూశ్రీ దత్తా

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

అనూప్ రూబెన్స్ ముగ్గురు కోతులు చిత్రం సాంగ్ రిలీజ్

Athreyapuram Brothers,: ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రీకరణ పూర్తి

తర్వాతి కథనం
Show comments