Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొండ, బెండ కాయలను వేపుడు చేసుకోవాలంటే?

కాయగూరలు అధికంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు అధికమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి కాయగూరనూ వండుకునే తినాలని లేదు. కొన్నింటిని సలాడ్ల రూపంలో.. పచ్చికూర ముక్కల్లా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా

Written By selvi
Updated: గురువారం, 2 నవంబరు 2017 (13:50 IST)
కాయగూరలు అధికంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు అధికమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి కాయగూరనూ వండుకునే తినాలని లేదు. కొన్నింటిని సలాడ్ల రూపంలో.. పచ్చికూర ముక్కల్లా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా దోస, కీర, టమోటా, క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి, క్యాప్సికం వంటివి ఇలా తీసుకోవచ్చు.
 
కూరగాయలను ఎక్కువ నీళ్లలో ఉడికించి, ఆ నీళ్లను వంచెయ్యటం కూడా సరికాదు. దానివల్ల ఫోలిక్‌ ఆమ్లం, కొన్ని రకాల ఖనిజాలు వృధా అవుతాయి. దొండ, బెండ వంటి కూరలతో వేపుడు చేసుకోవాలనుకుంటే చాలామంది నేరుగా వాటిని బాండీలో వేసి చాలాసేపు వేపుతుంటారు. దీనికంటే కూడా ముందు కొద్దిసేపు మైక్రోవేవ్‌లో ఉంచి, మెత్తబడిన తర్వాత కొద్దినూనెలో వేపుకోవచ్చు. దానివల్ల పోషక నష్టం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా క్యాబేజీ ఆకులు, గోబీ పువ్వు, పచ్చి బఠాణీ, బీన్స్‌ వంటివి ఒక్కసారి బాగా మరిగిన వేడి నీటిలో వేసి, రెండు నిమిషాలు ఉంచి, తీసుకోవచ్చు. కాయగూరలను ఎక్కువగా ఉడకబెట్టెయ్యటం, బాగా వేపుడులా చేసెయ్యటం మంచిది కాదు. దానివల్ల పోషక నష్టమే కానీ ఆరోగ్యానికి మేలు జరిగేదంటూ ఏమీ వుండదు. 
 
చిక్కుళ్లు, క్యారెట్లు, బీట్‌రూట్‌ వంటివి చాలామంది వేపుడు కూరల్లా నూనె వేసి చాలాసేపు వేయిస్తుంటారు. కానీ వాటిని ముందే ఒక్కసారి ప్రెజర్‌ కుక్కర్లో ఉడికించి, చాలా కొద్దినూనెలో తాలింపు పెట్టుకుంటే ఎక్కువ పోషకాలు పోకుండా ఉంటాయి. 

అన్నీ చూడండి

15 ఆగస్టు 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ అంచనా వివరాలు

ఒక్కసారిగా కుప్పకూలిన వాటర్‌ హెడ్‌ట్యాంక్, కుక్క కూడా పరిశీలించింది, వీడియో

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి.. జెండాను ఆవిష్కరించనున్న లోకేష్

Stree Shakti: ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి చేసుకున్న స్త్రీ శక్తి పథకం

దెయ్యాలు.. రాత్రిపూట గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు శబ్ధాలు.. హాస్టల్ ఖాళీ

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments