భారత్‌లో కొత్తగా 80,472 కరోనావైరస్ పాజిటివ్ కేసులు
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నది. దీనికితోడు వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 62 లక్షల 25,000 దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 80,472 కేసులు నమోదు కాగా 1179 మంది ప్రాణాలు కోల్పోయారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,428 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 62,25,764 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 9,40,441 ఉండగా 51,87,826 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
97,497మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.33 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.57 శాతానికి తగ్గిన మరణాలరేటు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 15.11గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,86,688 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహంచారు. కాగా ఇప్పటి వరకు దేశంలో 7,41,96,729 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.