ఏపీలో కరోనా దూకుడు : కేసులు 1500 క్రాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఫలితంగా గత రెండు రోజులుగా ఇక్కడ నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. తాజాగా వెల్లడైన బులిటెన్ మేరకు ఈ కేసుల సంఖ్య 1500 దాటాయి. గత 24 గంటల్లో 67,716 మంది శాంపిల్స్‌ని పరీక్షించగా 1,501 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 315 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.
ఇదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,697 మంది కోలుకోగా... 10 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,98,603కి పెరగగా... 19,69,169 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 13,696 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738 యాక్టివ్ కేసులు ఉన్నాయి.